contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీ.ఆర్.ఎస్ వస్తే మూడు పంటలకు నీళ్లు….కాంగ్రెస్ వస్తే పొలాలన్నీ బీళ్లు..

  •  రైతుల కష్టం తెలియని రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు
  • మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి

కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు కోతలతో సాగు చేసిన పంటలన్ని కళ్ళ ముందే ఎండిపోతుంటే చూడలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో చూశామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన తీర్మాణం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీమాంధ్ర చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని, మూడు గంటల కరెంటు ఇస్తే వ్యవసాయానికి సరిపోతుందని రేవంత్ రెడ్డి మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వడంతో పాటు లక్షలాది ఎకరాలకు సాగు నీరు ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులు చూడలేక కళ్ళలో కారం పోసుకుంటున్నారని దుయ్యబట్టారు.వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని,ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర పడ్డాయన్నారు.  బీఆర్ఎస్ సర్కారు వస్తే తెలంగాణ రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు మూడు పంటలకు సాగు నీళ్లు ఇవ్వడం జరుగుందని, కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక రైతులు పొలాలన్ని బీళ్లు పెట్టి బ్రతుకు దేరువు కోసం గల్ఫ్ దేశాలు,బీవండి, ముంబాయి, ఇతర ప్రాంతాలకు బ్రతకడానికి పోయేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు సాగు నీరిస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే పొలాలన్ని బీళ్లు ఉంటాయని,బీఆర్ఎస్ సర్కారు వస్తే 24 గంటల కరెంటుతో పాటు మూడు పంటలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వడం జరుగుందని పేర్కొన్నారు.ఎద్దు ఏడిస్తే ఎవుసం నిలువదు …రైతు కన్నీరు పెడితే రాజ్యం నిలువదని… రైతుల బ్రతుకులతో ఆడుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రైతులు సమాధి కట్టడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణలో రైతులు బీఆర్ఎస్ పార్టీకే మూడవ సారి పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడంతో పగటి వేషాలు వేస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో ఓట్ల రాజకీయం చేస్తూ కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.తెలంగాణలో రైతులు మూడవ సారి కూడా కేసీఆర్ సర్కారునే కావాలని కోరుతుంటే జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అడోగడు… ఇడోగడు మోపై పూటకో మాట..గడియకో వేషం వేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, తెలంగాణ లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రైతుల బ్రతుకులతో ఆడుకుంటే కాంగ్రెస్ ను రైతులు భూస్థాపితం చేయడం ఖాయమని అన్నారు. వ్యవసాయం అంటే తెలియని రేవంత్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కరెంటు కోతలతో రైతులు రాత్రి,పగలు తేడా లేకుండా బావులు,బోర్ల వద్దనే జీవనం సాగించే వారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాల బీడు భూములకు సాగు నీరందిస్తూ పచ్చటి మాగానులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణ రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకెళ్లి అప్పులు తెచ్చుకుని ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో రైతుబందు పథకం ప్రవేశపెట్టి ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఏ కారణంతోనైన మరణిస్తే రైతు కుటుంబం రోడ్డున పడొద్దనే లక్ష్యంతో రైతుభీమా పథకానికి అంకురార్పణ చేసి రూ.5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే మూడు గంటల కరెంటుతో పాటు పెన్షన్లు కూడా రూ.300లు ఇస్తామని చెప్పుతారని, రైతుబందు, రైతుభీమా పథకాలను కూడా కాంగ్రెస్ నాయకులు రద్దు చేస్తారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ సర్కారు మూడవ సారి కొలువుదీరబోతుందని పేర్కొన్నారు. మూడవ సారి సీఎంగా కేసీఆర్ విజయడంకా మోగించబోతున్నారన్నారు. మాయమాటలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్ పార్టీ పగటి వేశగాళ్ల మాటలను ప్రజలు నమ్మొద్దని…కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని అన్నారు.  కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది… బీఆర్ఎస్ వస్తే 24 గంటల కరెంటు వస్తుందని, ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పాలసీ కాదని, కుట్ర పూరితంగానే రేవంత్ రెడ్డి 3గంటల కరెంటు అని కుట్రకు తెరలేపాడని అన్నారు.2001లో అప్పటి సీమాంధ్ర చంద్రబాబు కరెంటు కావాలని అడిగిన పాపానికి బషీర్ బాజీలో రైతులపై కాల్పులు జరిపించారని, తెలంగాణ రైతులకు కరెంటు కావాలని అప్పుడు సీఎం కేసీఆర్ తన డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రైతుల కోసం అప్పటి నుంచి పోరాటం చేశారన్నారు. కాంగ్రేస్ పాలనలో చెరువులు,కుంటాల్లో చుక్క నీరు లేక నెర్రెలు బారి పోయాయని,చినుకు కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే వారని ఎమ్మెల్యే రసమయి వివరించారు.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి కలిసి రైతులు తీర్మానం చేసి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గుడెల్లి తిరుపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న,ఖాసీంపేట సర్పంచ్ గంప మల్లేశ్వరి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :