ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలోని శ్రీ స్వయంభూ మానసాదేవి ఆలయంలో జరుగుతున్న శ్రీ చక్ర యాగం కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పాల్గొని, అమ్మవారిని బీఆర్ఎస్ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. వేదపండితులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి ఆశీస్సులు అందజేశారు. గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్ర రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.