గుజరాత్ లో ఓ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించింది. మచ్చూ నదిపై మోర్బీ వద్ద ఉన్న ఈ తీగల వంతెన చాలా పాతది. కొన్నిరోజుల కిందటే ఆధునికీకరణ పనులు చేపట్టారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై కొన్ని వందల మంది ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజిలో వెల్లడైంది. ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలిపోయి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ బ్రిడ్జిల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి.
Terrifying moments of Morbi cable bridge collapse in Gujarat captured in CCTV
132 people lost their lives in this shocking tragedy pic.twitter.com/bleVRSVAY7
— Soumyajit Pattnaik (@soumyajitt) October 31, 2022