విశాఖపట్నంలో నిర్వహించిన నేషనల్ లెవల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో యధార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించిన ‘‘టార్చ్ లైట్’’ లఘు చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఎందరికో కనువిప్పు కలగాలని, ప్రస్తుత దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిన జీవిత ప్రయాణమే ఈ ‘‘టార్చ్ లైట్’’ లఘు చిత్రం సారాంశం. ఈ చిత్రం ద్వారా మరెందరికో కనువిప్పు కలగాలని మేము చేసిన ఈ ప్రయత్నానికి నేషనల్ లెవల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక కావడం మాకు, మా చిత్ర సిబ్బందికి చాలా సంతోషంగా వుందని నటీమణి అరుణా చౌదరి తమ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో సందేశాత్మక లఘు చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని చిత్ర దర్శకుడు రమేష్ జంగాల తెలిపారు. సోషల్ అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్ మంచి ప్రశంసలతో పాటు, అవార్డుని పొందడం కూడా చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో బెజవాడ మస్తాన్, అరుణా చౌదరి నటించగా, కెమెరామెన్ శేషు కేశవమఠం, రమేష్ జంగాల దర్శకత్వం వహించారు.
