కరీంనగర్ జిల్లా: ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దేశంలోనే తెలంగాణను తొలి రాష్ట్రంగా నిలబెడుతామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను వంద రోజులు గడిచినా నిలబెట్టుకోలేదని అన్నారు.గన్నేరువరం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం రామంచ సంపత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా రేపాక బాబు ఉపాధ్యక్షులుగా కల్లెపల్లి సురేష్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శిగా రామంచ సతీష్ మాదిగ, మండల కార్యదర్శిగా బండపల్లి మనోహర్ మాదిగ, మండల సంయుక్త కార్యదర్శిగా వెదిర రాజకుమార్ మాదిగ లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ హాజరై మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావడం లో జాప్యం చేస్తున్నారని అన్నారు. కొంత మంది మాల ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని , రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను , చేవెళ్ళ డిక్లరేషన్ ను ధిక్కరించి మాట్లాడుతున్న వారిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి,కేఆర్ నాగరాజులు పెడుతున్న సభల వెనుక ముఖ్యమంత్రి ప్రొత్బలం ఉందని అన్నారు. మాలల మాట విని ఎస్సీ వర్గీకరణ లేకుండానే టిచర్ ఉద్యోగాలు భర్తీ చేసి రేవంత్ రెడ్డి మాదిగ జాతికి ద్రోహం చేశాడని అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకే కట్టుబడి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ ప్రజల్లో విశ్వాసం కోల్పోయడని అన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరో పోరాటానికి మాదిగ ప్రజలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కనకం అంజిబాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గన్నేరువరం మండల ఇన్చార్జి తూనికి వసంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మాతంగి అనిల్ మాదిగ, ఏఎంసి డైరెక్టర్ కవ్వంపల్లి రాజయ్య మాదిగ,కవ్వంపల్లి మునీందర్ మాదిగ, కల్లేపల్లి కొమురయ్య మాదిగ, వేదిరే రాజయ్య మాదిగ, బొడ్డు శ్రీనివాస్ మాదిగ, ఆలువల సంపత్ మాదిగ, అలువాల అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.