పల్నాడు జిల్లా / బొల్లాపల్లి / మేళ్ళవాగు : మండలం మేళ్ళవాగు గ్రామంలో నీటి సరఫరా పైప్‌లైన్ పనుల కోసం కాంట్రాక్టర్ రహదారిని తొవ్వి అలాగే వదిలేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. గత వారం ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తొవ్వకాలు చేసిన ప్రదేశాలను మళ్లీ పూడ్చకపోవడంతో గుంతలు ఏర్పడి పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళల్లో లైట్ లేకపోవడంతో ఎవరైనా ఆ గుంతల్లో పడిపోయే అవకాశముందని స్థానికులు పైప్ లైన్ కోసం తవ్విన ప్రదేశాలను సక్రమంగా పూడ్చమని కోరితే అక్కడ ఉన్న సూపర్వైజర్ రసూల్ వేయరని, మీరే పూడ్చుకోవాలని దురుసుగా వ్యవహరించడమే కాకా మీ దిక్కున్న చోట చెప్పుకోండి .. నన్నెవరేమి చేయలేరని … అధికారులంతా మేము చెప్పిందే వింటారని … స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రమాదాలు జరగకముందే అధికారలు స్పందించి సూపర్వైజర్ రసూల్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










