టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబుకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. పలు విషయాలపై నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా అందరూ పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు వినిపించేందుకు సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.