- సైదాపురం మండలం పెరుమలపాడు గ్రామ పరిసర అటవీ భూముల్లో అక్రమంగా తెల్ల రాయి కోసం స్మగ్లర్లు మైనింగ్ చేస్తుండగా 9 భారీ యంత్రాలను (ఇటాచి 200) అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు….
- యంత్రాలను అటవీ అధికారుల నుండి విడిపించేందుకు రంగంలోకి దిగిన బ్రోకర్లు, రాజకీయ నాయకులు
- యంత్రాలను విడిపించుకునేందుకు అధికారులకు భారీ మొత్తం లో ముడుపులు ఇచ్చేందుకు స్మగ్లర్లు సిద్ధమైనట్టు చర్చలు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపణ
నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం: సైదాపురం మండలం పెరుములపాడు గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో భారీ యంత్రాలతో అక్రమంగా యదేచ్చగా మైనింగ్ చేస్తున్న వారిని పట్టుకుని ఘటనా ప్రాంతంలో 9 భారీ యంత్రాలను ఇతర వాహనాలను అటవీ శాఖ అధికారులు ఈ ఉదయం పట్టుకోగా అధికారుల నుండి ఈ యంత్రాలను విడిపించేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు గ్రామస్తుల ఆరోపణ, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాహనాలును సీజ్ చేసి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు చెబుతున్న మాట..
ఇప్పటికే కొంత మంది రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, అటవీ అధికారుల అండ దండలతో ఈ తెల్లరాయిస్మగ్లర్లు కుమ్మక్కై యదేచ్చగా అటవీ ,రెవెన్యూ భూముల్లో ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో గత నాలుగు నెలల లోపు కోట్లు గడించారని వీరి మైనింగ్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎవరైనా ఈ స్మగ్లింగ్ గురించి ప్రశ్నిస్తే రౌడీ మూకలతో దాడి చేయడానికి కూడా వెనుకాడటం లేదని సహజ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడేలా చేస్తూ యదేచ్చగా కొనసాగుతున్న ఈ తెల్ల రాయి స్మగ్లింగ్ ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అడ్డుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
https://amzn.to/45i1oCW -₹279 -86% Dicount M.R.P.: ₹1,999