- 711 దేవాలయాలకు, వినాయక మండపాలకు పంపిణీ
- ఏపీ, కర్ణాటకకు పూజ సామాగ్రి
- డ్రెస్ కోడ్ ఫ్లెక్సీలు సైతం పంపిణీ
- సొంత నిధులతోనే…. పంపిణీ
- రెండు, మూడు నెలలకు సరిపడా సామాగ్రి పంపిణీ
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ : ఈ నెల 27న వినాయక చవితిని పురస్కరించుకొని 711 పురాతన దేవాలయాలకు, వినాయక మండపాలకు పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వినాయక మండపాలకు అవసరమయ్యే 31 రకాల పూజ సామాగ్రితో పాటు పురాతన దేవాలయాల్లో ప్రతిరోజు నిత్య పూజకు అవసరమయ్యే 22 రకాల అన్ని సామాగ్రిని స్వచ్ఛందంగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలతోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పలు దేవాలయాలకు ఈ ధూపదీప నైవేద్య కార్యక్రమం సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఏపీ, కర్ణాటకకు పూజ సామాగ్రి
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలలో ఈ ఉచిత పూజ సామాగ్రి పంపిణి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రవీణ్ పేర్కొన్నారు. ఏపీలోని కర్నూల్, నంద్యాల,
కడప, అనంతపూర్, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గిద్దలూరు, విజయవాడ, గుంటూరు
తదితర జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్, సింధనూర్, గుల్బర్గా ప్రాంతాల్లో తెలుగువారు నివాసం వుండే పలు పురాతన దేవాలయాలకు, వినాయక మండపాలకు నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు.
డ్రెస్ కోడ్ ఫ్లెక్సీలు సైతం పంపిణీ
ఈ ఉచిత పూజ సామాగ్రి పంపిణీ తో పాటు దేవాలయానికి వచ్చే భక్తులు విధిగా సాంప్రదాయ వస్త్రధారణతో రావాలని సూచించే ఫ్లెక్సీలను సైతం పంపిణీ చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. దేవాలయాల ప్రధాన రహదారుల వెంబడి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల భక్తులలో కొంతమేర మార్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సొంత నిధులతోనే…. పంపిణీ
సొంత నిధులతోనే ఈ ధూప దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ప్రవీణ్ తెలిపారు. ఏ ఒక్కరి నుండి చందాలు తీసుకోకుండా తమ సొంత నిధులతోనే నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పురాతన ఆలయాలకు, వినాయక మండపాలకు పూజ సామాగ్రిని పంపిణీ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు . వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేనుసైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొంగర పవన్ కుమార్, రెయిన్ బో శ్రీనివాస్, తిరుమల లక్ష్మీనారాయణ, ప్రియ, సత్యం, దస్తయ్య, కొందూరు శ్రీహరి,
కొందూరు శ్రీహరి, గణేష్ రావు తదితరులు పాల్గొన్నారు.