నాగర్ కర్నూల్ జిల్లా : భారత దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా దేశ స్వాతంత్ర్యం మా జన్మహక్కు అని 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆవిర్భావించి మా అంతం చూసిన స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ దేశ స్వాతంత్ర్య రణరంగ సంగ్రామ పోరాటంలో ఎంతో మంది యువ కిషోరాలను బలిదానం చేసిన ఏకైక విద్యార్ధి సంఘమని, నాటి నుంచి నేటి వరకు 89 సంవత్సరాలుగా దేశ సమగ్రతపై విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఎఐఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా నాగర్ కర్నూల్ సిపిఐ లక్ష్మణ సారీ భవనం ఎదుట ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అధ్యక్ష వహించిన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చెర నుంచి మాతృభూమి విముక్తికై 1936 ఆగస్టు 12న ఎఐఎస్ఎఫ్ ఆవిర్భావించి దేశ స్వాతంత్రోద్యమంలో అసమాన పోరాటాలు నిర్వహించి, ఎంతో మంది విద్యార్థులను త్యాగం చేసిందని కొనియాడారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్య అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89 సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా – పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యారంగ సమస్యలపై చదువు-పోరాడు అంటూ దేశ వ్యాపితంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసిన సంఘం ఎఐఎస్ఎఫ్ అని అన్నారు. ఎంతో మంది రాజకీయ వేత్తలను, మేధావులను అందించిన చరిత్ర ఎఐఎస్ఎఫ్ కు ఉన్నదని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించిందని, 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎఐఎస్ఎఫ్ ఉద్యమ స్పూర్తితో నేటి పాలకులు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, అసమానతలతో కూడిన నూతన జాతీయ విద్యా విధానంకు వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలల్లో పాల్గొన్న నాయకులు ఏఐవైఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దేశమని ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లేష్, అభిషేక్, తరుణ్, మల్లికార్జున్, అరుణ్, మధు, ప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.