అవును మీరు చదివింది నిజమే.. మనకు తెలియకుండానే రిజర్వేషన్ లను సర్కార్ లేపేస్తుంది.
ఎలా అంటారా.. ఒక్కసారి ఇది చదవండి.
మీకు క్లారిటీ వచ్చేస్తుంది..
ఒక వ్యక్తికి నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయాలి అంటే, మత్తు మందు ఇవ్వాలి.. ఇచ్చిన తర్వాత డాక్టర్ మన శరీరాన్ని ఎలా కోసినా మనకు తెలియదు.. అలాగే రిజర్వేషన్ పొందుతున్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లు ఉన్నా.. ఇక మీద ఎందుకు పనికి రాకుండా ఉండేలా.. ప్రైవేటైజేషన్ అనే మత్తు మందు ఇచ్చి.. ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారో.. వాళ్లకు తెలియకుండానే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం ద్వారా.. రిజర్వేషన్ లు ఉన్నా అవి ఎందుకు పనికి రాకుండా ఉండేలా ఒక పెద్ద కార్యాచరణ మొదలైంది.
దేశం లో నిరుద్యోగం పెరుగుతూనే వస్తుంది.. ఈ ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం భారీగా భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా ఏమి లేవు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ ల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది..
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం ద్వారా నష్టపోయేది వెనుకబడిన వర్గాల వారే..
100 కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తాం అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు..
ఇవి అమ్మడం ద్వారా ఎవరికి నష్టం..?
రిజర్వేషన్ లు పొందే గిరిజన, దళిత, బీసీ. మైనారిటీ వర్గాల వ్యక్తులేగా…
రిజర్వేషన్ లను డైరెక్ట్ గా తీసేస్తే దేశం అట్టుడికి పోతుంది అనే విషయం కేంద్రానికి తెలుసు..
Sc St అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినప్పుడు.. దేశం మొత్తం ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో కేంద్రం కళ్లారా చూసింది.
కాబట్టి.. దొడ్డి దారిలో రిజర్వేషన్లను ఈ విధంగా నిర్వీర్యం చేయాలనే మాస్టర్ ప్లాన్ ను ప్రస్తుతం దేశంలో సెర వేగంగా అమలుపరుస్తుంది..
ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసారు.. భవిష్యత్ లో మొత్తం అమ్మేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు..
కుక్క ను చంపాలి అంటే, పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపాలి అలాగే..
తమ కార్యాచరణను అమలు చేయడానికి.. లాభాల్లో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసి.. నష్టాలు వస్తున్నాయి కాబట్టి అమ్మేస్తున్నాం అని చావు కబురు చల్లగా చెప్తున్నారు..
ఇది గ్రహించలేని ప్రజలు ఏమి పట్టనట్లు మనకెందులే అని చోద్యం చూస్తున్నారు..
ఈ దుర్మాగపు చర్యను అడ్డుకోకపోతే.. మళ్ళీ మనకు స్వతంత్రపు ముందు ఉన్న పరిస్థితులే ఎదురు అవుతాయి.. ఉద్యోగాలు ఉండవు.. ఉపాధి దొరకదు.. ఆర్ధికంగా పాతాళానికి పోతాం…
సామాజికంగా దూరం పెడతారు..
“బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమా అని.. SC ST BC లు సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారో.. ఆ బ్రతుకును దూరం చేయడానికి..
ఏ నరకం నుండి అయితే బయటపడి బాహ్య ప్రపంచంతో పోటీ పడుతూ జీవిస్తున్నామో..ఇవన్నీ దూరం చేసి మళ్ళీ ఆ రాతి యుగానికి మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది..
ఇప్పుడు మేల్కొనకపోతే.. మళ్ళీ నీ బ్రతుకు బానిస బ్రతుకే..
మళ్ళీ నిన్ను అంటరానివాడిగా మార్చే కుట్రను మొదలుపెట్టాయి..
ఇప్పటికైనా మేల్కో..
Sure no organization will rise from their deep sleep. జై భీమ్ జై భారత రాజ్యాంగం