పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలపై పోలీసులు మెరుపుదాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఐలా బజార్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు చేపట్టారు.
ఈ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకుని, అందులో పాల్గొంటున్న షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ.4.58 లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్, పలు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠా కొంతకాలంగా గుప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బెట్టింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించి, వారికి బహుమతులు అందజేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








