contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

పాత స్టాంపుల అమ్మకానికి కేంద్రబిందువు కారంపూడి

పాత స్టాంపుకు 50 వేలు వాసులు చేస్తున్న కారంపూడి స్టాంప్ వెండర్

గాంధీబొమ్మ సెంటర్లో దర్జాగా అమ్మకాలు

స్టాంప్ వెండరే రైటర్ గా మారిన వైనం

పట్టించుకోని గురజాల సబ్ రిజిస్టర్ అధికారులు

స్థలాల ధరలకు కారంపూడిలో రెక్కలు రావటంతో నిత్యం స్థలాల పై సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఆర్యవైశ్య విధి తదితర ప్రాంతాలలో స్థలాల వివాదాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కారంపూడిలోని గాంధీబొమ్మ సెంటర్ లో సెల్ ఫోన్ సిమ్ కార్డుల వ్యాపారం నిర్వహిస్తున్న స్టాంప్ వెండర్ దీనిని అసరాగా తీసుకొని విచ్చలవిడిగా పాత స్టాంపులు అమ్ముతున్నట్లు సమాచారం. 5,10,20 రూపాయల పాత స్టాంపులు 50 వేల రూపాయలకు విక్రాయిస్తున్నట్లు సాక్షాత్తు పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు కర్నా. సైదారావు ఒక ప్రకటనలో ఈ స్టాంపు వెండర్ పై ఆరోపణ చేయటం జరిగింది. పల్నాడు ప్రాంతంలో పాత స్టాంపు కావాలంటే కారంపూడి గాంధీబొమ్మ సెంటర్ లో ఈ స్టాంపు వెండర్ వద్ద దొరుకుతాయని ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాత స్టాంపుల అమ్మకంతో పాటు దాని మీద రాసే బాధ్యతను కూడా ఈ స్టాంపు వెండరే తీసుకొని కొంతమంది అయన బ్రోకర్ల సహాయంతో పిడుగురాళ్ల, గురజాల ప్రాంతాలకు పంపించి పాత స్టాంపుల పై అగ్రిమెంట్లు రాపించటం జరుగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా స్టాంపు వెండర్ గా ఉన్న ఆ వ్యక్తి స్టాంపు రైటర్ గా అవతరమెత్తి ఒక్కొక్క అగ్రిమెంట్ కు మూడు వేల నుండి ఐదు వేల వరకు వసులు చేస్తున్నట్లు సమాచారం. కారంపూడి మండలంలో భూముల ధరలు హైదరాబాద్ ను తలపిస్తున్నాయి ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారులు తమ ఫైనాన్స్ వ్యాపారాలకు స్వస్తి పలికి రియల్ ఎస్టేట్ రంగం పై మక్కువ చూపటంతో లక్ష రూపాయలు విలువ చేసే భూమి ఒక్కసారిగా పది నుండి పదిహేను లక్షలు పలుకుతుంది. పెదవాడు సెంటు భూమి కొనాలంటే కొనలేని పరిస్థితి. భూకబ్జా దారులకు పాత స్టాంపులు అమ్ముతున్న స్టాంపు రైటర్ బాగా ఉపయోగపడుతున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతుంది. ఈ స్టాంపుల వలన ఇటీవల భూవివాదాలు కూడా జరిగాయి. వీటి అన్నిటికి ముల బిందువు పాత స్టాంపుల అమ్మకం ఈ స్టాంపు రైటర్ పాత స్టాంపుల అమ్మకం పై భారీగా సంపాదించినట్లు ప్రచారం కూడా కారంపూడిలో వినిపిస్తుంది. సబ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారుల అండదండలు ఈ స్టాంపు వెండర్ కు ఉండటంతో పాత స్టాంపులను మూడు పువ్వులు ఆరు కాయలు అన్నా చందంగా అమ్ముతు లక్షలకు లక్షలు సొమ్ముచేసుకుంటున్నాడు.పేరుకేమో సిమ్ కార్డుల అమ్మకం షాపు లోపల అంతా స్టాంపులు అమ్మటం కొన్నవారికి అగ్రిమెంట్లు వ్రాయటం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మినీ సబ్ రిజిస్టర్ కార్యాలయం నడుస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా పాత స్టాంపుల అమ్మకం వలన ఒకరి స్థలం ఒకరు బదిలీ చేసుకుంటూ భూబకాసులు పేదవర్గాల స్థలాలకు రక్షణ లేకుండా చేస్తున్నారన్న మాట అక్షర సత్యంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా సబ్ రిజిస్టర్ శాఖ అధికారులు మమ్ముళ్ల మత్తు నుంచి బయటకు విడి స్టాంపు వెండర్ గా, రైటర్ గా పాత స్టాంపుల అమ్మకందారునిగా చలామని అవుతున్న ఇలాంటి వ్యాపారుల పై చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :