హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. IPC సెక్షన్స్ 353, 290, 506 కింద కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఆందోళన చేస్తూ పోలీసులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న కౌంటింగ్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తన కార్యకర్తలతో కలిసి పోలీసులపై తిరగబడిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన తీరుపై సీపీ అభిషేక్ మహంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం లాఠీ పట్టుకుని వారిని ఉరికించారు. కౌంటింగ్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ (Karimnagar) టూటౌన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. IPC సెక్షన్స్ 353, 290, 506 కింద కేసు ఫైల్ చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి ని ఉరికించి కొట్టిన పోలీసులు #padikaushikreddy #shortviral #viralvideo #BRSParty pic.twitter.com/WM1w752vxD
— The Reporter TV (@Rporterinida) December 5, 2023