- 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బాలుర జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కి కళాశాల సిబ్బంది శాలువాతో సత్కరించారు. విద్యార్థుల చేత ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే కళాశాల ప్రాంగణంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి, గౌరవ వందనం చేశారు. కళాశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలు ఎమ్మెల్యే తిలకించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ పాకాల పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిల్లలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే విద్యార్థులు మంచి నడవడికతో ముందుకు వెళ్తే మంచి భవిషత్తు ఉంటుంది అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి భారత దేశ గౌరవాన్ని కాపాడాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం డిగ్రీ మరియు జూనియర్, కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే పులివర్తి నాని సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన జూనియర్, డిగ్రీ కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పేరు పేరునా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.