పాకాల: తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లె పంచాయతీలోని ఊట్లవారిపల్లె సమీపాన ఆనందగిరి కొండపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి 77వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాణిపాక దేవస్థానం నుంచీ తీసుకు వచ్చిన పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు ఎం ఎల్ ఏ, డా మురళి మోహన్ దంపతులు, కాణిపాకం ఈఓ పెంచల కిషోర్, పులివర్తి వినీల్ దంపతులు స్వామి అమ్మవార్లకు సారెను సమర్పించారు. స్వామివారి దర్శన అనంతరం దంపతులను ఆలయ సిబ్బంది శాలువాలతో సత్కరించారు. సాయంత్రం భరణి దీపోత్సవం తదుపరి రాత్రి సతీ సమేతంగా కుమారస్వామి నెమలి వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు. ఉభయదారులచే శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యం స్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీలో మయూర వాహనంపై ఆశీనుల్ని చేసి గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరు కాగా వేద పండితుల మంత్రొచ్చారణలతో మొదలైన పల్లకీ సేవ, మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాంతం స్కంధుని ఊరేగింపు కన్నుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
