తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ గుట్ట కింద ఇండ్లులో కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఏ.టీ.ఎం కార్డు తరహాలోని నూతన స్మార్ట్ రేషన్ కార్డులను చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని సోమవారం రోజున లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాకాల మండలంలోని 41 రేషన్ షాపులకు 15693 స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం. ఈ స్మార్ట్ కార్డు ను స్కాన్ చేస్తే కార్డులోని లబ్ధిదారుల వివరాలు ఎన్ని కేజీలు బియ్యం, ఇతర వస్తువులు మరియు కుటుంబ సభ్యులు వివరాలు చూపిస్తుంది అని వారు తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానంలో రాజ ముద్రతో కూడిన నూతన క్యూ.ఆర్ కోడ్ ద్వారా రేషన్ కార్డులను తిరుపతి జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల 80 వేల మంది లబ్ధిదారులతో 120 రేషన్ షాపులలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పంపిణీ చేయడం మొదలు కావడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, రేషన్ డీలర్లు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
