- విద్యార్థి జీవితంలో గురువు ఒక కాంతిపుంజం
- విద్యార్థి గొప్ప లక్ష్యాలను చేరుకోవడానికి మార్గదర్శకులు గురువులే
పాకాల : పాకాల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగరాల నందు గడిచిన ( నిన్నటి దినం జరగవలసిన) ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది వనపర్తి వెంకట సిద్ధులు, ఆదికేశవులు, ప్రమోదిని, సుల్తాన్ ,బాబు, రామమూర్తి,నీరజ, విమలా విక్టోరియా , బోధనేతర సిబ్బంది మోహన్ రావు,హరి మరియు సి. ఆర్ .పి మునికృష్ణలను పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు సుమలత ఘనంగా సన్మానించారు. తదుపరి ఉపాధ్యాయులు ,విద్యార్థులు కలిసి ప్రధానోపాధ్యాయురాలి ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వారి ప్రసంగాలతో గురువులను కీర్తించారు. తదుపరి ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును కొనియాడుతూ దేశాభివృద్ధిలో గురువులు పరోక్ష భాగస్వాము లని, విద్యార్థులకు నిజమైన కథానాయకులు, ప్రేరణ ఉపాధ్యాయులే నని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.