పాకాల: టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో సెప్టెంబరు 15న సోమవారం పాకాల మండల కేంద్రంలోని పిహెచ్సీతోపాటు దామలచెరువులోని గ్రామ సచివాలయం-1లో పింక్ బస్ క్యాంపులు జరుగనున్నాయని వైద్యాధికారులు డాక్టర్ బాబు అలెగ్జాండర్, డాక్టర్ రవిరామ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటలకు క్యాంపు ప్రారంభమవుతుందని, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపునకు వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తీసుకురావాలని తెలిపారు.
స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్, విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు.