- నిన్న ముగిసిన రాయబారం
బ్రహ్మనాయుడు నేత్రుత్వంలో మాచర్లను పలిస్తున్న మలిదేవాదుల వనవాసం అనంతరం తన రాజ్యాం అప్పగించాలంటూ గురజాలను పాలిస్తున్న నలగామ రాజు వద్దకు అలరాజును రాయబారిగా పంపగా అది వికటించటంతోనే పల్నాటి యుద్దానికి బీజం పడిందని చారిత్రిక కధనం. పల్నాటి విరారధనోత్సవలలో రెండవ రోజైన బుధవారం రాయబారం ఘట్టాన్ని అత్యంత రసవత్తంగా నిర్వహించారు. వీర్ల ఆలయంలో అలనాటి చారిత్రిక సన్నివేశాలు ఇతివృత్తంగా మాలిదేవాదులు కోడిపందెంలో ఓడిపోవుటతో ముందస్తుగా జరిగిన ఒప్పందం మేరకు బ్రాహ్మనాయుడు, మలిదేవాదులు వారి అనుచరులు రాజ్యం వదిలి 7 సంవత్సరాలు వనవాసము పూర్తి చేసుకొని మేడిపి (నేడు ప్రకాశం జిల్లా )లో వుంటున్నారు. ఒప్పంద గడువు తిరి 6 నెలలు కావటంతో తమ రాజ్యాన్ని తిరిగి పొందెందుకుగాను ఆ సమయంలో నలగామరాజు అల్లుడు పేరిందేవి భర్త అలరాజు రాయబారం కోసం బ్రహ్మనాయుడు గురజాల పంపుతాడు. అలారాజును రాయబారం పంపే సమయంలో అతని తల్లి ” చెల్లెమ్మ ” బ్రహ్మనాయునితో ఇలా అంటుంది. వీరాగ్రేసులైన పెద బాలరాజును గాని నీ మానసపుత్రుడు పల్నాటి రాజ్య సర్వసైన్యధ్యక్షులు మాల కన్నమదాసు, నీ కుమారుడు బాలచంద్రున్ని కానీ పంపవచ్చుగా అని పేర్కొంటుంది. కోడి పందెములో గురజాల వారు చేసిన మోసమును దుర్మార్గును తెలిసి కూడా దర్మం, న్యాయం పేరిట మనలను ఓటమి అంగీకరించమన్నపుడు నిష్పక్షపాతంగా వ్యవహారించిన ధర్మమూర్తి అలరాజు అని బ్రహ్మనాయుడు కొనియాడతాడు. అలరాజుకు అంగరక్షకుడిగా పంపటమే కాకుండా మహీన్వితమైన తులసి మాలను ధరింపజేసీ పంపుతానని బ్రాహ్మనాయుడు పేర్కొంటాడు. దీనితో అలరాజు రాయబారం వెళ్లేందుకు తల్లి అంగీకరిస్తుంది. ఈ క్రమములో వారు మార్గమధ్యలో కండ్లేరు దాటవలసివస్తుంది. ఆ మార్గంలో బాలచంద్రుడు అటుగా వస్తాడు. ఇరువురు ఏరు దాటు విషయంలో సరదాగా ఓ పందెం కాస్తారు. ఓడిన వారు నిలువు దోపిడీ గావించాలని షరతు. ఈ పందెంలో అలరాజు అలరాజు ఓడిపోవటంతో నిలువు దోపిడీగా అన్ని ఆభరణములతో పాటు బ్రాహ్మనాయుడు దరింపజేసిన తులసి మాలను కూడా తీస్తాడు. అనంతరం అలంకరణ పూర్తి చేసుకున్న అలరాజు తులసిమాలను ధరించుట మర్చిపోయి గురజాలకు వెళ్తారు. గురజాల రాజ్య మంత్రిణి నాగమ్మ దౌత్యమునకు సహకరించపోగా సూదిమోపినంత నేల కూడా ఇవ్వమని పేర్కొనగా రాజు అయిన నలగామరాజు కోపోద్రేకమును అలరాజు పై వ్యక్తం చేస్తాడు. దీనితో సహనానికి విలువలేకుండా పోయింది పల్నాట రక్తము ఏరులై పరవలసిందే అంటూ అలరాజు యుద్ధ ప్రకటన చేస్తున్నాను. సిద్ధంకండి.. విజయమో.. వీరస్వర్గమో రణరంగంలో తేల్చుకుందాం అని తన సూర్య భేతాళామనే ఖడ్గమును తీసి విరావేశము ప్రదర్శిస్తారు. తిరుగు ప్రయాణ మార్గంమధ్యలో చర్లగుడిపాడు సమీపాన మంత్రి నాయకురాలు నాగమ్మ కుతంత్రంతో తంబళ్లజీయర్ సహకారంతో అలరాజు పై విశాప్రయోగం చేయించి చంపిస్తుంది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధం ఆసన్నమైందని ప్రకటచేస్తారని చారిత్రక కధనం. అలనాటి కధా సన్నివేశాలను బ్రహ్మనాయుడు వేషధారణలో పిఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు పీఠం నిర్వాహకులు బి. విజయ్ కుమార్ విరచారవంతులు తమ తమ కోణతములతో పాల్గొన్నారు.