పల్నాడు జిల్లా – పిడుగురాళ్ళ : పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారన్న వార్త స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొన్ని కాలనీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల సిసి కెమెరా లో రికార్డు అయింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని షాక్కి గురి చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.
కానీ పిడుగురాళ్ళ సిఐ వెంకట్ రావు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలలో ఎంజాయ్ చేస్తూ కనిపించడం స్థానిక ప్రజలలలో కొంత అసహనం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన వలన రాష్ట్రాలలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుని పలు భద్రతా, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఈ సిఐ మాత్రం పట్టనట్టు వ్యహరించడం పై పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.
జిల్లాలో గాని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో పోలీసుల కార్డాన్ సెర్చ్ లు కరువయ్యాయి. ఎవరు వస్తున్నారో .. ఎవరు పోతున్నారో అంతుచిక్కడం లేదు. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల పై పూర్తిగా పోలీసులు విఫలమైనట్టు తెలుస్తోంది. పిడుగురాళ్ళ పట్టణమే కాక పలు ప్రాంతాలకి ఎందరో వలస వస్తున్నారు. ఎవరు వారు ? ఎక్కడి వారు ? నిజంగా భారతీయలేనా లేక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల పై వస్తున్నారా ? జిల్లా లో కమ్యూనిటీ పోలీసింగ్ ఉందా ? ఉంటే ఎం చేస్తుంది ?
ఢిల్లీ ఘటన తరువాత దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల పై జిల్లా ఎస్పీ నేటికీ ఎటువంటి ఆదేశాలు అధికారులకు జారీ చేసినట్టు సమాచారం లేదు. వలసదారులు వోటుబ్యాంక్ మారుతున్నారు. వారు నిజంగా వలసదారులా లేక ఎవరు వారు ? .. జిల్లా పోలీసు యాత్రాయాంగం ఇటువంటి కీలక అంశాలపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.









