పల్నాడు జిల్లా – నరసారావుపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా పరిపాలన పరిమార్పులలో భాగంగా కృతిగా శుక్లా IAS ను పల్నాడు జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఈ ఉత్తర్వులు శుక్రవారం వెలువడగా, ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
కృతిగా శుక్లా 2013 బ్యాచ్‌కు చెందిన IAS అధికారిణి. ఇప్పటికే ఆమె రాష్ట్రంలోని వివిధ స్థానాల్లో ముఖ్య పదవులు నిర్వహించారు. ప్రజలతో మమేకం, పరిపాలనపై పట్టుదల, సమస్యలను వేగంగా పరిష్కరించే శైలితో ఆమెకు మంచి పేరుంది. ఇటీవల ఆమె స్థానిక పరిపాలన విభాగంలో ముఖ్య బాధ్యతలు నిర్వహించారు.
పల్నాడు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి ఆమె నేతృత్వం కీలకంగా మారనుంది. ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్య రంగాలపై ఆమె దృష్టిసారించే అవకాశం ఉంది. జిల్లాలో ఆమెను కలెక్టర్‌గా స్వాగతిస్తున్నామని పల్నాడు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పేర్కొన్నారు.