పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్
ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ మాట్లాడుతూ – “జగనన్నకు చెబుదాం” కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి, పోర్టల్ లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలన్నారు. పోక్సో కేసులు, మహిళల పై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసులు మొదలైన కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని మరియు సదరు నేరాలు అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారి చేసారు.
పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి,సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, ఫలితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని పోలీస్ అధికారులకు సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల పిర్యాదులు అందిన వెంటనే ప్రతిస్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి గాని సిబ్బంది గాని ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గతంలో పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి రూరల్ సర్కిల్ లో, నర్సరావుపేట టూ టౌన్, అమరావతి పోలీస్ స్టేషన్లలో సీఐలుగా పనిచేసి ఉత్తమ ప్రతిభ కనబరిచి బదిలీ పై వెళ్లిన సిఐ ఉమేష్ గారిని, సీఐ వెంకటరావు గారిని, సిఐ శివ ప్రసాద్ గారిని అభినందించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా సన్మానించారు.









