contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Palnadu : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు తప్పనిసరి : ఎస్పీ శ్రీనివాసరావు

పల్నాడు జిల్లా పోలీస్ :  వినాయక ఉత్సవాల నిర్వాహకులు మండపాల ఏర్పాటు, ఊరేగింపుల నిర్వహణ కొరకు తప్పనిసరిగా పోలీసు వారి ముందస్తు అనుమతులు తీసుకోవాలని  జిల్లా ఎస్పీ  కంచి శ్రీనివాసరావు  తెలిపారు. అనుమతుల కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానం అనుసరించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా https://ganeshutsav.net క్లిక్ చేసి అనుమతులు పొందాలి. ఈ విధానంతో గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనం కొరకు అనుమతులు సులభంగా సులభంగా పొందవచ్చు.
దరఖాస్తు  చేయు విధానం: వెబ్సైటులోకి వెళ్లి New Application క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది. దరఖాస్తు ఫారంలో నమోదు చేయాల్సిన వివరాలు :  దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా.అసోసియేషన్/కమిటీ పేరు. గణేష్ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు. ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్.  ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. గణేష్ నిమర్జనం తేది, సమయం, వాహన వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పణ అనంతరం సంబంధిత పోలీసులు ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. NOC & QR కోడ్ డౌన్లోడ్  చేయు విధానం: కమిటీ సభ్యులు https://ganeshutsav.net/applicationStatus లోకి వెళ్లి మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే, No Objection Certificate (NOC)  పాటించాల్సిన నిబంధనలతో కూడిన QR కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన NOC & QR కోడ్ ను ప్రింట్ తీసి, లేమినేట్ చేసి మండపంలో ఉంచాలి. తనిఖీకి వచ్చే అధికారులు వీటిని పరిశీలిస్తారు.  కావున వినాయక విగ్రహాలు ఏర్పాటు, ఊరేగింపులు నిర్వహించే ప్రజలు తప్పనిసరిగా పోలీస్ వారి సూచనలు పాటించి  పండుగను ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని  ఎస్పీ  సూచించారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :