ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో పచ్చని వ్యవసాయ భూముల్లో పరిశ్రమల నిర్మాణాన్ని నిలిపివేయాలన్న డిమాండ్‌తో పీడీయం రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు కే. శ్రీనివాసరావు, తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కే. శ్రీనివాసరావు మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో పచ్చని పంట పొలాల్లో ఇండో సోలార్ విద్యుత్ ప్లాంట్, శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణాల కోసం వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవాలని చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను తక్షణం విరమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములపైనే పరిశ్రమలు స్థాపించాలని, ప్రైవేటు వ్యవసాయ భూములను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు.
ఈ నెల 24న ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరగబోయే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, ఆ కార్యక్రమాన్ని ప్రముఖ రైతు నాయకుడు, రైతు స్వరాజ్య వేదిక బాధ్యులు వడ్డే శోభనాద్రిశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు.
సదస్సులో న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి. ప్రసాద్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, పీడియం రాష్ట్ర కార్యదర్శి కే. వెంకటేష్, కార్గో ఎయిర్‌పోర్ట్ పోరాట కమిటీ కన్వీనర్ కొమర వాసు, పీడియం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరావు తదితరులు పాల్గొని ప్రసంగించనున్నారు.
కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో U. వెంకటేష్, యు. నరసింహారావు, లక్ష్మీ నరసమ్మ, జానకమ్మ, U. రాధ, అనంతలక్ష్మి తదితరులు ఉన్నారు.