పల్నాడు జిల్లా / పిడుగురాళ్ళ : పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డు రైల్వే గేటు వద్ద రైలు పట్టాలపై మృతి చెందిన ఇరువురు వ్యక్తులను రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన రాత్రి 10 :50 నిమిషాలలోపు జరిగి ఉంటుందని భావిస్తున్నారు, మృతులు షేక్ షరీఫ్ 22 సంవత్సరాలు, గరికపూడి ఏసు దాసు (36) తండ్రి మరియదాసు, ఏసు దాసు కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు గాంధీనగర్ పిడుగురాళ్ల కు చెందిన వ్యక్తులు గా నడికుడి రైల్వే ఎస్సై పి రమేష్ బాబు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన గురించి ఎంక్వయిరీ చేస్తున్నామని రైల్వే పోలీసులు మీడియాకు తెలియజేశారు. మృతులలో ఏసుదాస్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడు పట్నంలో తాపీ పనిచేసుకుంటూ మీడియా రంగంలో పనిచేస్తున్నారని, ఈ క్రమంలో పట్నంలో వడ్డెర కులానికి చెందిన వ్యక్తులు తమ కుమారుని,షేక్ బాజీ ని అత్యంత దారుణంగా చంపి రైల్వే ట్రాక్ పై పడవేశారని ఆరోపించారు. ఈ హత్యలు పాల్గొన్న వ్యక్తులపై న్యాయబద్ధంగా విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోని తగిన శిక్ష విధించాలని మీడియా ముఖంగా రైల్వే పోలీసులను, స్థానిక పోలీసులను వేడుకున్నారు.










