కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ చోక్కల్లపల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు సమర్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. అనంతరం కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సింధు చందర్, నాయకులు కనకయ్య, కొలుపుల రవి , రవీందర్రెడ్డి, దేవరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
