contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్డు ప్రమాదాల నీవారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: జిల్లా ఎస్పీ కె. సృజన

  • పోలీస్ శాఖ అధ్వర్యంలో రోడ్డు ప్రమాద నివారణ పై నిర్వహించిన అవగహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన
  • పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నీవారించుటకు పోలీస్ శాఖ, రోడ్డు అథారిటీ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం కుడా అవసరమని జిల్లా ఎస్పీ  కె. సృజన  అన్నారు.

జోగులాంబా గద్వాల జిల్లా : జిల్లా ఎస్పీ  కె. సృజన ఆదేశాల మేరకు డి.ఎస్పీ శ్రీ ఎన్.సి.హెచ్ రంగ స్వామి  సూచనలతో అలంపూర్ సి. ఐ సూర్య నాయక్ అధ్వర్యంలో జాతీయ రహదారి పై బీచూపల్లి నుండి టోల్ ప్లాజ వరకు ఉన్న వ్యాపార సముదాయాలు, డాబాలు, హోటల్స్ యజమానులకు, సిబ్బందికి జాతీయ రహదారి పక్కన ఉన్న 22 గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఆయ గ్రామాల యువత కు, R &B అదికారులు, హై వే అథారిటీ, 108 సిబ్బందికి రోడ్డు ప్రమాద నివారణ కు తీసుకోవాల్సిన పై జాగ్రత్తల పై బీచుపల్లి లోని చండూరు నాగప్ప నాయుడు ఫంక్షన్ హాల్ నందు అవగహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు 3 నెలలుగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది అని అన్నారు. పోలీస్ శాఖ, రోడ్డు అథారిటీ వారు ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు కుడా భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నీవారించగలమని అన్నారు.

రోడ్డుపై అడుగు పెడితే చాలు.. ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారి తీస్తుందని సుఖవంతమైన ప్రయాణానికి, వేగంగా గమ్యస్థానానికి చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపాల్లా మార్చేస్తున్నాయని, అయితే ప్రమాదాల నివారణకు, ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయట పడేందుకు ఏర్పాటు చేసిన సాంకేతిక, రక్షణ వ్యవస్థలను సైతం వాహన చోదకులు తేలిగ్గా తీసుకోవడంతో, చిన్న చిన్న మనవ తప్పిదాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.ప్రజలు తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడపాలని, ప్రమాదాలకు గురై అభం శుభం తెలియని తమ పిల్లలకు తీరని వ్యధను మిగల్చవద్దని అన్నారు. జాతీయ రహదారి పైకి వెళ్ళే సమయంలో, జాతీయ రహదారి క్రాస్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. గత 3 నెలలుగా తీసుకుంటున్నా చర్యల వల్ల గత సంవత్సరం తో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అన్నారు. వాటినీ పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అందులో బాగంగా పోలీస్ కళా బృందం ద్వారా జాతీయ రహదారి పై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. జాతీయ రహదారి పై ఉన్న ప్రతి హొటల్, డాబా, వ్యాపార సముదాయం నందు తప్పనిసరిగ cc కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగితే సమీపం లోని వారు 108కు సమచారం అందించాలని తద్వారా వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారని, అలాగే ప్రమాదానికి గురైన వారికీ CPR వంటి ఫస్ట్ రెస్పాన్ డెంట్ సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడలని కోరారు.

డి. ఎస్పీ  మాట్లాడుతూ….. జాతీయ రహదారి పై ఎదురెదురుగా వెళ్ళడం, ర్యాస్ గా , అజాగ్రత్త వెళ్ళడం వంటి చిన్న చిన్న మనవ తప్పిదాల వల్ల ప్రమాదాలకు గురైతున్నరని, జిల్లా ఎస్పీ మేడం గారు గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు చేపట్టి హై వే అథారిటీ అధికారులతో మాట్లాడి గుర్తించిన హాట్ స్పాట్స్ లలో తగు ఏర్పాట్లు చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అన్నారు. అలంపూర్ సి ఐ  రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు అక్కడ ఉండే హోటల్, డాబాలు, వ్యాపార సముదాయాల సిబ్బంది ఎల స్పందించాలి, మానవత్వం తో కనీస సహాయం గా బాధితులకు ఫస్ట్ రెస్పాన్డార్ బాధ్యత గా ఏమీ చేయలో వివరించారు.  మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో రూపకంగా తెలియజేసారు.

హై వే అథారిటీ అధికారి మాట్లాడుతూ ……. జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ ఏ అరేంజ్మెంట్స్ చేశారో తెలియజేసారు. ఇంక ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయ గ్రామాల సర్పంచ్ ల విన్నపం మేరకు జాతీయ రహదారి పై స్టేజి దగ్గర లైటింగ్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేసారు.

108 అధికారి మాట్లాడుతూ …..జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు 108 కు సమచారం ఇచ్చినప్పుడు ఏ ఏ వివరాలు తెలియజేయాలో, 108 అందించే సేవల గురించి వివారించారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ సి ఐ సూర్య నాయక్ , హై వే అథారిటీ ఇంజనీర్ భార్గవ , R&B ఈ ఈ ప్రగతి మేడం, 108 మేనేజర్ రాజు, ఇటిక్యాల, కోదండపుర్, మనోపాడ్ మరియు ఉండవల్లి ఎస్సై లు గోకారి, వెంకట స్వామి, సంతోష్, బాలరాజు, జాతీయ రహదారి పై బీచూపల్లి నుండి టోల్ ప్లాజ వరకు ఉన్న వ్యాపార సముదాయాల, డాబాలు, హోటల్స్ యజమానులు, సిబ్బంది, జాతీయ రహదారి పై ఉన్న గ్రామాల సర్పంచ్ లు,MPTC లు, ఆయా గ్రామాల యువతమరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :