- పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలి
- ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చెయ్యాలి.
- మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి భాదితులకు న్యాయం చేకుర్చాలి.
- పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయాలి
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ఎస్పీ.
ప్రకాశం జిల్లా: పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో శుక్రవారం ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, NDPS, ఎస్సీ, ఎస్టీ, పోక్సో/రేప్, రోడ్డు ఆక్సిడెంట్, పెండింగ్ ఎన్బిడబ్ల్యుఎస్ మరియు ఇతర కేసులతో పాటు డిపిఓలో వివిధ పెండింగ్ రిప్లయ్స్ పై సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి, కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, చార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, పోక్సో కేసులు మరియు రేప్ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలన్నారు. అదేవిధంగా స్కూల్లు మరియు కాలేజీలో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయాలని, పిల్లలకు బ్యాడ్ టచ్ మరియు గుడ్ టచ్ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని, చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి కట్టడి చెయ్యాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డ్స్, బారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిడెంట్ కు సంబంధించిన FAR, IAR & DAR రిపోర్ట్స్ ను నిర్ణిత కాలవ్యవధిలో గౌరవ MACT కోర్ట్ కు పంపించాలి.
గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ క్రైమ్ నివారణకు చర్యలు తీసుకోవాలని మరియు పెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తులను గుర్తించి అరెస్టు చేయాలి. సైబర్ నేరాలపై ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో విచారణ తొందరగా పూర్తిచేసి, కోర్ట్ లో చార్జిషీట్ లను నిర్ణిత సమయంలో దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
యూనిఫామ్ సర్వీస్ నిర్వహించే ప్రతి సిబ్బంది ఎంతో నియమ నిబంధనలతో విధులు నిర్వర్తించాలని, సిబ్బంది యొక్క ప్రవర్తన సరిగా లేకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.
అలాగే రాబోవు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని సూచించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అనధికారికంగా బాణసంచా తయారీ, నిల్వలు, రవాణా వంటి వాటిని నియంత్రించి ముందస్తు ప్రమాదాలను నిలువరించే దిశగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముందుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు గౌరవ ఒంగోలు మూడవ అదనపు జిల్లా కోర్ట్ జడ్జి శ్రీ డి.రాములు గారు ఎవిడెన్స్ యాక్ట్, రిలేటింగ్ టు ఇన్వెస్టిగేషన్ గురించి, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరణ గురించి, కేసును ఏవిధంగా నమోదు చేయాలి, అరెస్ట్, ప్రాపర్టీ రికవరీ ఏవిధంగా చేయాలి, నేర ఒప్పుకోలు నమోదు నందు పాటించవలసిన జాగ్రత్తలు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలనే విషయాలపై అవగాహనా కల్పించి వారికున్న సందేహాలను నివృత్తి చేసినారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడు గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 లో జరిగిన బాలుడు హత్య కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ప్రస్తుతం పామూరు సిఐ భీమా నాయక్, ప్రస్తుతం బి.విపేట ఎస్సై రవీంద్రనాథ్ రెడ్డి మరియు కోర్టు లైజన్ కానిస్టేబుల్ వరదయ్య లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను (GSE) అందజేసారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో ASP (క్రైమ్) యస్.వి.శ్రీధర్ రావు, ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డిఎస్పీలు, ఆర్.శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, పోలీస్ లీగల్ అడ్వైసర్ వేణుగోపాల్, సీఐలు, ఆర్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు.