కరీంనగర్ జిల్లా: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు యువకులు ప్రశాంతంగా జరుపుకోవాలని గన్నేరువరం ఎస్సై చందా నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ డీజే లు గాని సౌండ్ సిస్టం గాని నిర్వహించరాదని. రోడ్లపై వేడుకలను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వరుసగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.