మెదక్ జిల్లా / తూప్రాన్ : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టపడుతుం దని మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసులు అన్నారు. తూప్రాన్ లో శనివారం సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు . ఎస్పీ మాట్లా డుతూ సీసీ కెమెరాలు లేకుంటే నేరాల నియంత్రణ కష్టమవుతుందని, అలాగే విచారణలో తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. గంజాయి క్రయ విక్రయాల పై నిఘా కోసం ఒక ఎస్సై, సిబ్బంది తో టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం మూలంగానే యాక్సిడెంట్ లు జరుగుతున్నాయని, రాంగ్ రూట్ లో వెళితే జరిమానా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, డి.ఎస్.పి నరేందర్ గౌడ్, రామయంపేట సీఐ తూప్రాన్ సీఐ, తూప్రాన్ ఎస్సై , మనోరబాద్ ఎస్సై, తూప్రాన్ పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు.