కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ హోటల్ గది నందు ఆదివారం నాడు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ మరియు వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 11 మంది జూదరులను పట్టుకున్నారు. వారి వివరాలు తిమ్మాపూర్ కు చెందిన బట్టు వెంకటేష్, పోతరాజు దేవేందర్, తాటిపల్లి దినకర్,గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన పగిడి రాజు, బహదూర్ ఖాన్ పేటకు చెందిన తప్పట్ల సంజయ్, ముంజంపల్లికి చెందిన బత్తిని నర్సయ్య, కరీంనగర్ లోని కోతి రాంపూర్ కు చెందిన పడాలి సతీష్, భగత్ నగర్ కు చెందిన కందుల రాజు,జ్యోతి నగర్ కు చెందిన రసమల్ల వేణు, రాంనగర్ కు చెందిన బొంగోని రాజ్ కుమార్, కొడిమ్యాల మండలం చిట్యాల కు చెందిన గోగురి శేఖర్ రెడ్డిలు కాగా, వారి వద్ద నుండి (రూ 1,31,200) ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు స్వాధీనపరుచుకున్నారని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జె.సరిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ సదరు వ్యక్తులపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 34/2024, U/Sec. 3 and 4 of gaming act ప్రకారం కేసు నమోదు చేసారని తెలిపారు.