contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ స్టేషన్ లోని పోలీసు తుపాకీ ఎత్తుకుపోయిన గజదొంగ … తుపాకీతో పాటు పది కాట్రిజ్ లు కూడా మాయం

ఉత్తరప్రదేశ్ లో సాక్షాత్తు పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడొక దొంగ. ఏకంగా పోలీసుల తుపాకీనే ఎత్తుకుపోయాడు. ఈ ఘటన కాన్పూర్ జిల్లా ఆజాద్ నగర్ పరిధిలోని ఒక ఔట్ పోస్టులో నిన్న రాత్రి జరిగింది. తుపాకీ కనిపించకపోవడంతో ఔట్ పోస్ట్ ఇన్చార్జీ సుధాకర్ పాండేపై కేసు నమోదు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలవడంతో… పాండేపై జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఈ క్రమంలో ఔట్ పోస్టును పరిశీలించిన అధికారులు తుపాకీతో పాటు పది కాట్రిజ్ లు, యూనిఫాం కూడా పోయాయని గుర్తించారు. ఈ చోరీపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :