ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గమ్ లోని నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో సోమవారం స్థానిక శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ కనపర్తి ఎత్తి పోతల పథకాన్ని ప్రారంభించారు .

ఈ పథకం ద్వారా నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలు పరిధిలోని గ్రామాలలో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందుతుందని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే రైతుల పరిస్థితి మెరుగ్గా ఉంటుందని మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి తెలియజేశారు.
కనపర్తి ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు ఈదర కృష్ణారావు, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ళ మనోజ్ కుమార్, దివి పున్నారావు, మండల వ్యవసాయ అధికారి వెంకట్రావు శాలువా మరియు పుష్ప గుచ్చమ్ తో ఎమ్మెల్యేను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎత్తిపోతల పాలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











