ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం”కు కురుపాం నియోజకవర్గంలో శుభారంభం జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి శనివారం ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కురుపాం నియోజకవర్గంలో ‘రచ్చబండ’ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. వచ్చే 40 రోజుల పాటు, నవంబర్ 22 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వరకు కోటి సంతకాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.