పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చినరావికోనలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆడబిడ్డను బ్రతికించుకోవడానికి ఆమె తండ్రి, అన్నయ్య పడిన కష్టం హృదయాలను చలింపచేసింది. ఏజెన్సీలో గిరిశికర గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు పడుతున్న అవస్థలు కళ్ళకు కట్టినట్లు కనిపించింది.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చినరావికోన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు పడుతున్నారు. అనారోగ్యానికి గురైన యువతిని ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులకు తిప్పలు తప్పడం లేదు. నిమ్మక లలిత అనే గిరిజన యువతి అస్వస్థతకు గురవడంతో ఆమె తండ్రి లివిరి, అన్నయ్య తిరుపతి భుజాన ఎత్తుకుని 3 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించారు.
గత కొన్ని కొన్నేళ్ళుగా రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు . ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు