పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం తాడికొండ గ్రామ సమీపంలోని సుందరమైన మోగనాలి (తాడికొండ) జలపాతాన్ని పర్యాటకుల సందర్శనార్థం గురువారం ప్రారంభించారు. ఈ జలపాతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మరియు జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు జలపాతానికి సమీపంలోని వనదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన కాఫీ అండ్ ఫాస్ట్ ఫుడ్ షాప్ను కూడా వారు ప్రారంభించారు. ప్రకృతి అందాలతో నిండి ఉన్న జలపాతాన్ని వీక్షించిన వారు మంత్రముగ్ధులయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి గారు, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ –
“జిల్లాలో ఉన్న సహజసిద్ధ ప్రకృతి సంపదను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగానే మొగనాలి జలపాతాన్ని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చాం,” అని తెలిపారు.
పర్యాటకుల రాకపోకల సౌలభ్యం కోసం తాడికొండ నుండి జలపాతం వరకు బైక్ రైడర్స్ సేవలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, ఎంఈఓ చంద్రశేఖర్, టిడిపి మండల అధ్యక్షులు, అడ్డాకుల నరేష్, బిబిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం, తహసిల్దార్ శేఖరం,
అలాగే ఐటిడిఎ, గ్రామీణాభివృద్ధి శాఖ, కూటమి నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న మొగనాలి జలపాతం, అడవుల మధ్య శాంతి, సౌందర్యంతో కూడిన అనుభూతిని అందిస్తూ పర్యాటకులకు కొత్త ఆకర్షణగా మారనుంది.