పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మ వలస మండలం, అలమండ పంచాయతీ పరిధిలోని నీలకంఠాపురం గిరిజన గ్రామ సమీపంలో వట్టి గెడ్డ రిజర్వాయర్ ఎడమ ప్రధాన కాలువకు గండి పడింది. ఈ కారణంగా సాగునీరు వృధాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాలువకు గండి పడటం వల్ల జియ్యమ్మ వలస నీటి సంఘం పరిధిలో సుమారు 1000 ఎకరాలు, అలమండ పంచాయతీ పరిధిలో 200 ఎకరాలు మొత్తం సుమారు 1200 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో పొలాల్లోని వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్ల ముందు పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.