పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండలం పరిధిలోని గిరిజన ప్రాంతమైన గుమ్మడి గూడ పంచాయతీ లో ఉన్న దండు సూర అంగన్వాడి కేంద్రం శిశు సంక్షేమ సేవల్లో ఒక కొత్త ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి కార్యకర్త మెనక జోగమ్మ మరియు హెల్పర్ తాడంగి జయంతిలు అపారమైన అంకితభావంతో పని చేస్తున్నారు.
చిన్నారులకు ఆటపాటల ద్వారా నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ, బొమ్మలు, చార్ట్‌లు వంటి సౌందర్య పద్ధతుల ద్వారా పిల్లల్లో నేర్చుకునే ఆసక్తిని పెంచుతున్నారు. పిల్లల మానసిక అభివృద్ధికి అనుగుణంగా పాఠ్యాంశాలను సమర్ధవంతంగా బోధిస్తున్నారు.
అంతేకాకుండా, పిల్లల శారీరక అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, అత్యంత నాణ్యమైన, సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడంలో జోగమ్మ, జయంతిలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పల్లె ప్రదేశాల్లోనూ, అదీ గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అరుదు అన్నదానికి గ్రామస్తుల అభిప్రాయం ఆధారంగా అర్థమవుతోంది.
“తల్లి ప్రేమతో, గురువుల అంకితంతో” అన్న మోతాదులో చిన్నారులకు మార్గదర్శకత్వం అందిస్తూ, ఈ అంగన్వాడి కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన జోగమ్మ, జయంతిల కృషిని గ్రామస్తులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.
ఇది ఇతర అంగన్వాడి కేంద్రాలకు కూడా మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం.