ఆంధ్రప్రదేశ్ – పార్వతీపురం : పార్వతీపురంమన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తుండగా ప్రమాదం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్‌పైభాగం, అద్దాలు ధ్వంసం అయ్యాయి.
క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంంది. విజయనగరం నుంచి ఫ్యాన్స్ ఐటెం పేరుతో పార్సిల్ కౌంటర్‌కి బాక్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ అధికారులు, స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.