తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు, రాబోయే స్థానిక ఎన్నికలలో శతశాతం విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు అలాగే ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు గురువారం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎల్విన్ పేట కూడలి వద్ద అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎల్విన్ పేట కూడలి నుంచి బి.ఎస్.ఆర్ కళ్యాణ మండపం వరకు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ పార్టీ ఎంతో నమ్మకంతో, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. కార్యకర్తలు పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి ఒక్కరూ పని చేస్తేనే ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే విజయం సాధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిపైన పసుపు జెండా ఎగిరేలా కృషి చేయాలి అని ఆమె కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి గెలుపుకి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్, ఏఎంసి చైర్పర్సన్ కడ్రక కళావతి, రాష్ట్ర ట్రైకర్ బోర్డ్ డైరెక్టర్ పువ్వల లావణ్య, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అక్కెన మధుసూదన్ రావు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, కొమరాడ మండల పార్టీ అధ్యక్షులు ఉదయ్ శేఖర్ పాత్రుడు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ నాయకో, టి.ఎ.సి సభ్యులు నందివాడ కృష్ణబాబు, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు మారడాన తవిటి నాయుడు, సీనియర్ నాయకులు నంగిరెడ్డి మధుసూదనరావు, గుల్లిపల్లి సుదర్శన్ రావు, పొట్నూరు వెంకటనాయుడు, విజయంకుశం, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, నియోజకవర్గ రైతు అధ్యక్షులు గురాన శ్రీరామూర్తి నాయుడు, అరకు పార్లమెంట్ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు, గరుగుబిల్లి ఎంపీపీ ఉరిటి రామారావు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, రాష్ట తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు వావిలపల్లి దివాకర్, ఎపిటిసి కోట సుమన్, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, కె.వి.కొండయ్య, జోగి భుజంగరావు, మరడాన నారాయణ స్వామి నాయుడు, నాయకులు పాడి సుదర్శన్ రావు, సోములు మాస్టర్, బిడ్డికి తమ్మయ్య, దాసరి రామారావు, ఆరిక విప్లవ కుమార్, కిషోర్, కృష్ణమూర్తి నాయుడు, హైమావతి మరియు ఐదు మండలాలకు సంబంధించిన మండల కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సహా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









