జీయ్యమ్మ వలస మండలం: పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యామ్మ వలస మండలం,గవర్మపేట పంచాయతీ, వెంకటరాజపురం గ్రామంలో మండల వ్యవసాయశాఖ అధికారి విజయభారతి ఆదేశాలతో, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అధికారి రావుపల్లి ఇందిరా ప్రియదర్శని, తమ పిపిసి సిబ్బంది,టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్,మంగళవారం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు పై ఖరీఫ్ సీజన్ 2025-2026 వ సంవత్సరం గాను రైతులకు అవగాహన కల్పించారు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రభుత్వము రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండాలని ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుందని. రైతులకు గిట్టుబాటు ధరను అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టిందని, రైతులు తన పంటని కనీసం మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవలసిన అవసరం లేదని తెలియజేశారు.అలాగే ధాన్యం కనీస మద్దతు ధర గ్రేట్ ఏ రకము క్వింటాలం 2389 రూపాయలు, అలాగే 40 కేజీలకు 955.60 రూపాయలు గాను, 80 కేజీలకు 1911.20 రూపాయలకు గాను, సాధారణ రకం క్వింటాలం 2369.0 రూపాయలు, 40 కేజీలకు 947.60 రూపాయలు, 80 కేజీలకు 1895.20 రూపాయలుగాను ప్రభుత్వం నిర్ణయించిందని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అదనపు సౌకర్యాలు కల్పిస్తుందని, ఉచిత గోనె సంచులు సరఫరా, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేశారు. ఒకవేళ రైతు గోని సంచులు కానీ హమాలీలు కానీ రవాణా కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆ పైకము నేరుగా రైతు ఖాతాలోకి ధాన్యం సొమ్ముతో సహా చెల్లించబడుతుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫిర్యాదు చేయగలరని తెలియజేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర సిబ్బందితోపాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.









