కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును బుధవారం లబ్ధిదారునికి అందజేశారు. కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, నీచుకవలస గ్రామానికి చెందిన గంటెడా మహేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎమ్మెల్యే జగదీశ్వరి దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన ఆమె, బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. ఈ మేరకు, గంటెడా మహేష్‌కు రూ. 94,502/- ఆర్థిక సహాయం మంజూరైంది. బుధవారం ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి స్వయంగా ఈ చెక్కును మహేష్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జోగి భుంజగరావు, ఏఎంసీ చైర్ పర్సన్ కడ్రక కళావతి, ఎంపీపీ బొంగు సురేష్, అరకు పార్లమెంట్ టీడీపీ అధికారి ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, గురాన శ్రీరామూర్తి నాయుడు, సోములు మాష్టారు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న ఈ ఆర్థిక తోడ్పాటు పట్ల లబ్ధిదారుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.









