- కొమరాడ ఆశ్రమ పాఠశాల ఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణ స్పందన.
పార్వతీపురం : రిపోర్టర్ టీవీ కథనం: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం: పట్టించుకోని అధికారులు అనే శీర్షికతో పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, కెమిశిల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచురించిన వార్తా కథనంపై జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తక్షణమే స్పందించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు, గిరిజన సంక్షేమ ఉపసంచాయకులు ఆర్. కృష్ణవేణి తమ సిబ్బందితో కలిసి కెమిశిల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా, పాఠశాల మరియు వసతి గృహంలో నిర్వహణ సక్రమంగా లేదని అధికారులు గుర్తించారు. ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, వసతుల కొరతను అధికారులు ధ్రువీకరించారు.
అధికారి పై క్రమశిక్షణా చర్యలు:
పాఠశాల నిర్వహణలో లోపాలను గుర్తించిన నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ప్రధానోపాధ్యాయుడుకు, డిప్యూటీ వార్డెన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు రిపోర్టర్ టీవీ కి తెలియజేసారు. ఈ విధంగా, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, విచారణకు ఆదేశించడం మరియు బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరిగింది.