- మంత్రుల చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్న కార్యకర్తలు
- గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మరింత బలోపేతం: మంత్రి సంధ్యారాణి.
పార్వతీపురం – కురుపాం మండలం: కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు శుభవార్త అందింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గమిడి సంధ్యారాణి చేతుల మీదుగా మొత్తం 33 మంది మినీ కార్యకర్తలకు మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా ( ఏ డబ్ల్యు డబ్ల్యు ఎస్ ) పదోన్నతి ఉత్తర్వులను అందించారు. ఈ పదోన్నతులు పొందిన వారిలో జియ్యమ్మవలస మండలం నుంచి 7 గురు కార్యకర్తలు, కురుపాం మండలం నుంచి 26 మంది కార్యకర్తలు ఉన్నారు.
కార్యకర్తల కళ్లల్లో ఆనందం పదోన్నతి ఉత్తర్వులు అందుకున్న కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంగన్‌వాడీ వ్యవస్థలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. వీరందరి వద్ద కురుపాం ప్రాజెక్ట్ అధికారులు మెయిన్ ఏడబ్ల్యుడబ్ల్యుఎస్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు.ఈ పదోన్నతుల కార్యక్రమంలో మంత్రి గమిడి సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ కనక దుర్గ గారు తదితర అధికారులు పాల్గొన్నారు.










