పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యులు గ తోయక జగదీశ్వరి హాజరయ్యారు.
అధికారులకు దిశానిర్దేశం:
సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి పలు శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అభివృద్ధి కార్యక్రమాలలో వేగం పెంచాలని ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉరిటి రామారావు, ఎంపిడిఓ పైడితల్లి, ఎంపిటిసి సత్యనారాయణ, సర్పంచ్ రాంబాబుతో పాటు స్థానిక ఎంపిటిసిలు, సర్పంచులు మరియు ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










