కురుపాం నియోజకవర్గం: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, ఆర్నడ గ్రామ పంచాయతీలోని వనజ గ్రామానికి చెందిన కురుపాం(నాగురు)నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు, జేఏసీ అధ్యక్షులు నిమ్మక జయరాజు, అన్యాయానికి గురైన గిరిజనుల కోసం న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కోర్టు నంబర్ 2, ఐటమ్ నంబర్ 14, సివిల్ అప్పీల్ నంబర్ 14872/2024 డివిజన్ బెంచ్ ముందు ఆయన వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి రిపోర్టర్ టీవీ ప్రతినిధితో సరవాణి లో తెలిపారు, దశాబ్దాల కాలం నుంచి గిరిజనులు కాని రాజులు, క్షత్రియులు, ఇతర కులాల వారు దొంగ కుల ధ్రువపత్రాలతో ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అక్రమంగా ప్రవేశించి, అసెంబ్లీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు యథేచ్ఛగా అనుభవిస్తున్నారని తెలిపారు. దీనివల్ల నిజమైన గిరిజన ఆదివాసులు అణగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కుల ధ్రువపత్రాలతో నిజమైన గిరిజనులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్న ఉద్దేశంతోనే తాను అలుపెరగని పోరాటం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించానని వివరించారు.
ఇదే పోరాటంలో భాగంగా, మాజీ రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు దివంగత మాజీ ఎమ్మెల్యే వీ.టీ. జనార్దన్ తట్రాజ్ ఎస్టీలు కారని రుజువు చేసి, నిజమైన గిరిజన బిడ్డలైన మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, ప్రస్తుతం కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న తోయక జగదీశ్వరి ఉన్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన పాముల పుష్పశ్రీవాణి కులంపై పదేళ్లుగా ఆరోపణలు ఉన్నాయని, వివిధ సంఘాలు, నాయకుల ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయి కుల నిర్ధారణ కమిటీలు విచారణ చేపట్టాయని తెలిపారు. ఆమె “ఎస్టీ కొండదొర” అని ప్రభుత్వం ద్వారా జీవో తెచ్చుకున్నప్పటికీ, ఆ జీవోను నమ్మక రాష్ట్ర హైకోర్టులో కేసు వేశానని, ఆ కేసు నంబర్ WP9475/2022.
మాజీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణీ ఎస్టీ కులం కాదని ఆరోపిస్తూ, సెక్షన్ ఫిర్యాదు నెంబర్ WP20/2019 కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశానని, అయితే హైకోర్టు “తెచ్చిటికల ఇన్ ఫ్రేక్షర్ ” అనే దాన్ని ఉపయోగించి ఆ ఫిర్యాదును కొట్టివేసిందని ఆయన తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోవడంతో, న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టును ఆశ్రయించానని జయరాజు చెప్పారు.
సుప్రీంకోర్టులో ఈ కేసు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటిశ్వర్ సింగ్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు విచారణకు వచ్చిందని, తనకు న్యాయం జరగాలని నిమ్మక జయరాజు కోరారు. తమకు ఉన్నది న్యాయస్థానం ఒక్కటే అని అన్నారు. వాదాపా ప్రతి వాదనలు కొనసాగుతున్నాయని,మరికొంత సమయం వేచి చూడాలని సూచించినట్లు తెలిపారు. తన పోరాటం అలుపెరగని పోరాటం అందరి కోసం’ అనే నినాదంతో కొనసాగుతుందని, ఈ పోరాటంలో న్యాయం జరిగితే ఒక్క తనకు మాత్రమే న్యాయం జరిగినట్టు కాదని, నిజమైన ప్రతి గిరిజనుడికి న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ కేసు విచారణలో తనతో పాటు సాలూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది రేగు మహేశ్వరరావు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, అడ్వకేట్ కే.వీ.వీ. సత్యనారాయణ రెడ్డి హాజరైనట్లు నిమ్మక జయరాజు తెలిపారు.