కరీంనగర్ జిల్లా: నిన్న రాత్రి నగరం లోని రాంనగర్ మరియు ఎస్.అర్.అర్ కళాశాల వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విజయబెరి కి సంబందించిన తన పోస్టర్ లు గోడలకు అంటిస్తుండగ వచ్చి దాడి చేయడంపై నేడు కాంగ్రెస్ సీనియర్ నేత రమ్య రావు రెగులపాటి పోలీస్ కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమ్యా రావు మాట్లాడుతూ ఇలాంటి చర్యలు పిరికిపందల చర్యలని అన్నారు. తనను రాజకీయంగా ఓర్వలేని వ్యక్తులు దమ్ముంటే తనతో నేరుగా కొట్లడాలని సవాలు విసిరారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదని ఏది ఏమైనా రాజకీయం గా న్యాయపరంగా ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని అన్నారు.