- తడిసిన దాన్యం కూడా కొనుగోలు చేస్తాం
- రైతు సంక్షేమమే మాకు ముఖ్యం
- దళారి వ్యవస్థ నుంచి రైతును కాపాడేందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా మనకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలంలోని తల్లపెల్లి, గలిపెల్లి గ్రామాలలో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి నష్ట పోయిన పంట పొలాలను, తడిసిన దాన్యం ను సోమవారం రోజు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సాంసృకుతిక సారథి చర్మన్ డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన పంట నష్టపోయిన రైతులకు భరోసా నింపారు, తడిసిన పంట కొనుగోలు తో పాటు,పంట దెబ్బతిన్న రైతుకు పరిహారం వచ్చేవిధంగా ,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివేలుతానని హమీఇచ్చారు, పంటల వారిగా రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించాలని , సర్వేను వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులను,మరియు మండల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ,జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు,మండల యం. పి.పి,ఆయ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బి.ర్.స్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.