వై.ఎస్.ఆర్ : జిల్లా లోని ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, మంటపం పల్లి వద్ద భారీగా ఎర్రచందనం డంప్ పట్టుకున్న పోలీసులు
100 ఎర్ర చందనం దుంగలు, ( దాదాపు రెండు టన్నుల బరువున్న) ఎర్రచందనం దుంగలు, స్కోడా కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం
నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టిన ఎస్పీ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్ల ఆస్తులను సీజ్ చేస్తున్నామని వెల్లడించిన జిల్లా ఎస్పీ గారు..
ఇప్పటి వరకు పది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను స్మగ్లర్ల నుంచి జప్తు చేస్తామని తెలిపిన ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్
కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఒంటిమిట్ట సి.ఐ రాజా ప్రభాకర్, ఒంటిమిట్ట ఎస్.ఐ సంజీవ రాయుడు, సిబ్బంది ని జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందచేశారు.










